గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్

నవతెలంగాణ – మల్హర్ రావు
గంజాయి రవాణా చేస్తూ అడ్డంగా నలుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. కాటారం డివిజన్ పరిధిలో గంజాయి రవాణ చేస్తున్నారనే సమాచారం మేరకు నిఘా పెట్టి మంగళవారం కాటారంపోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు, సబ్ ఇన్స్పెక్టర్ అభినవ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో కాటారం పోలీస్ అధికారుల బృందం సిబ్బంది బయ్యారం గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నలుగురు వ్యక్తులు అనుమానస్పదంగా ఉండడం పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అప్రమత్తమైన పోలీసులు నలుగురు వ్యక్తుల్ని పట్టుకున్నట్లుగా తెలిపారు. ఈ నలుగురు వ్యక్తులను సాక్షుల సమక్షంలో విచారించగా వీరు కాటారం గ్రామానికి చెందిన మాడెం ప్రవీణ్ కుమార్, గంట పరిపూర్ణం, బయ్యారం గ్రామానికి చెందిన జగజ్జంపుల విష్ణు, కొత్తపల్లి గ్రామానికి చెందిన సోదరి సునీల్ లు నలుగురు కలిసి గత కొంతకాలంగా సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తూ మిగతాది కాటారం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. నలుగురు యువకులను అక్కడికక్కడే అరెస్టు చేసి వీరి వద్ద నుంచి రూ. 12 విలువచేసే 430 గ్రాముల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకొని కాటారం పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి మంగళవారం జ్యుడీషియల్ రిమాండ్ కోసం భూపాలపల్లి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా గంజాయి రవాణా చేసిన, విక్రయించిన, సేవించిన, గంజాయి పండించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Spread the love