నవతెలంగాణ కంఠేశ్వర్ : నగరంలోని నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పులాంగ్ ప్రాంతంలో పేకటాడుతున్నారని విశ్వసనీయ సమాచార మేరకు దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని వారు వద్దగల 15,400 రూపాయలతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.