నలుగురు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతులు

నవతెలంగాణ-సిటీ బ్యూరో
నగరంలోని ట్రాఫిక్ విభాగంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతుల్లభించాయి. మంగళవారం నార్త్ జోన్ అదనపు ట్రాఫిక్ డిసిపి ఎస్ రంగారావు తెలిపిన వివరాల మేరకు.. మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై ఎం శంకర్ రాజు, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న మోహన్ బాబు నాయక్, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైలుగా పనిచేస్తున్న పి శ్రీనివాస్, పి. నరేష్ కుమార్ సిఐలుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ఏసిపి మురళీకృష్ణ వీరిని ప్రత్యేకంగా అభినందించారు.. ఈ కార్యక్రమంలో ఏసీపీ శంకర్ రాజు, సీఐ రాజా శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love