ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

నవతెలంగాణ- హైదరాబాద్: ఈనెల 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ( Minister Sridhar Babu) స్పష్టం చేశారు. గురువారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ గురించిన వివరాలను మీడియాకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆర్థిక మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ…‘‘ఈనెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచాం. రాబోయే ఐదేండ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తాం. ఆరు గ్యారెంటీలపై క్యాబినెట్ లో చర్చించాం. రేపు 2 గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చిస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలి. శ్వేతపత్రం సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 2014 నుంచి 2023 డిసెంబర్‌ 7వ తేదీ వరకు ప్రభుత్వ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.

Spread the love