– సీయోను ఎవాంజెలికల్ చర్చి నిర్వహాకురాలు మిరియం
– మద్యహ్నం 12 గం.వరకు వివరాల నమోదు
నవతెలంగాణ-బెజ్జంకి
ఈ నెల 8న మండల కేంద్రంలోని ఎవాంజెలికల్ చర్చి అవరణంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు హార్వెస్ట్ మినిస్ట్రీస్ సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీయోను ఎవాంజెలికల్ చర్చి నిర్వహాకురాలు ఓరుగంటి మిరియం అదివారం తెలిపారు.నేటి నుండి 8 తేది మద్యహ్నం 12 గం.వరకు వివరాలు నమోదు చేసుకున్న వారికే రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని మండలంలోని అయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ ఉచిత క్యాన్సర్ రోగ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని మిరియం సూచించారు. వివరాల నమోదుకు 9701315161, 9494996906 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.