నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ 

నవతెలంగాణ -సుల్తాన్ 

నాంపల్లి ప్రభుత్వ  ఏరియా ఆస్పత్రి ఆవరణలోని డయాలసిస్ సెంటర్ లో ప్రతిరోజు 15 మంది కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ చేస్తున్నామని సెంటర్ ఇన్చార్జి వి కేశవ్ చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ..కిడ్నీ రోగు లు ఒకరోజు ముందు సెంటర్ లో తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డ్, సీఎం సిఓ లెటర్, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా కిడ్నీ రోగులకు డయాలసిస్ చేస్తున్నామని తెలిపారు. వివిధ జిల్లాల నుండే కాకుండా నగరం నుండి కూడా కిడ్నీ రోగులు వస్తున్నారని చెప్పారు. వారికి అన్ని విధాల వైద్య సేవలు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఉచితంగా డయాలసిస్ అవుతుండడంతో నిరుపేద కిడ్నీ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి వారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో (కిడ్నీ) డయాలసిస్ సెంటర్ టెక్నీషియన్ లు ప్రసన్న, అక్షయ్, సెంటర్ ఎగ్జిక్యూటివ్ సుభాషి తదితరులు పాల్గొన్నారు.
Spread the love