లయన్స్ క్లబ్బు ఆఫ్ నవనాతపురం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

నవతెలంగాణ -ఆర్మూర్
లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ సోమవారం పర్యావరణ పరిరక్షణ ను కాపాడేందుకు మట్టి గణపతులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రమాధాకరమైన రసాయనలతో, ప్లాస్టర్ అఫ్ ప్యారీస్ తో తయారైనా గణపతులను వాడకుండా పర్యావరణమును, నీటి కాలుష్యం కాకుండా చూసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్, కొంగి మనోహర్, మ్యాక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love