నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. పంపిణీ కోసం 84 మంది కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేయగా, ఈ నెలాఖరుకు వాటిని ఖరారు చేయనున్నారు. అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో చేప పిల్లలను చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లలో విడుదల చేయనుంది. అటు నాణ్యతలేని చేపపిల్లలు పంపిణీ చేస్తే బ్లాక్‌లిస్టులో పెడతామని అధికారులు కాంట్రాక్టర్లను హెచ్చరించారు.