నవతెలంగాణ – కంఠేశ్వర్
సోలార్ పివీ ఇన్స్టాలర్ సూర్య మిత్ర పథకం కింద రాజీవ్ గాంధీ ఐటీఐ కళాశాల నిర్మల్లో సోలార్ పవర్ సంబంధించిన 90 రోజులు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని గ్రీన్ బూర్జ టెక్నాలజీ సిస్టం ప్రాజెక్టు డైరెక్టర్ అమిత్ దేశ్ పాండే మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. ఈ కోర్సు కు ఐటిఐ డిప్లమా లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ , సివిల్ , ఫిట్టర్, వెల్డర్, ఇస్పీ మెడిటేషన్, మెకానికల్ విద్యార్థులు ఉన్న నిరుద్యోగులు శిక్షణకు అర్హులు అని తెలియజేశారు. ఈ పౌర శిక్షణ కార్యక్రమం ఈనెల 18 నుంచి ప్రారంభమవుతా యని అన్నారు. అభ్యర్థులు వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలని గరిష్ట వయే పరిమితి 30 సంవత్సరాలు ఉండాలని అన్నారు. శిక్షణలో ఉత్తీర్ణ లైన అభ్యర్థులకు సోలార్ తదితర సంబంధిత కంపెనీలలో ఉద్యోగావకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు మరిన్ని వివరాలకు 990 854 6640 నెంబర్ కు సంప్రదించాలని ఆయన కోరారు.