లక్ష్మాపూర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం

నవతెలంగాణ-శామీర్‌ పేట
గ్రామీణ పాత్రల్లో పేదలకు మెరుగైన వైద్యం కోసం హెల్త్‌ క్యాంపులు దోహదపడుతుందని ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఏఆర్‌సీ హాస్పిటల్‌ ఎండి డాక్టర్‌. విఎస్‌ఎన్‌ రాజు అన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో ఆదివారం ఏఆర్‌సీి హాస్పటల్‌ ఈసీఐఎల్‌ వారు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అనే నినాదంతో పేద ప్రజలకు సేవ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ శిబిరంలో సుమారు 150 మంది గ్రామస్తులకు ఆరోగ్య పరిక్షాల తోపాటు ఎముకలకు సంబంధించిన చెకప్‌లు చేశారు. అంతేగాక హాస్పిటల్‌ వారు గ్రామపంచాయతీకి ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ కటికల వైద్యనాథ్‌ గ్రామ పెద్దలు మర్యాల వీరేశం గుప్తా, వై.చిత్తయ్య గౌడ్‌, సింగం నర్సింగ్‌ రావు, సింగం భాస్కర్‌, కారోబార్‌ నరసింహా పాల్గొన్నారు.

Spread the love