నిక్షయ్ దివాస్ లో భాగంగా ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
నిక్షయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.టీబీ నీ భారత దేశం నుండి అంతం చేయాలని దానికి అందరి సహాయ సహకారం కావాలని ఉస్మానియా ఆస్పత్రి సూపర్వైజర్ ఖలీల్ అహ్మద్ అన్నారు. శనివారం ముస్లిం జంగ్ ఫూల్ చౌరస్తా వద్ద అమన్ వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయకుమార్ పాల్గొని రోగులను పరీక్షించి మందులను అందించారు. అనంతరం టీబీ పై సూపర్వైజర్ ఖలీల్ అమ్మద్ మాట్లాడుతూ.. మందులు వాడుతున్న వారికి ప్రతినెల 500/- రూపాయలు (ప్రభుత్వం నుండి తమ తమ అకౌంట్ ని జమా చేయటం జరుగు కుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్. పి బి హెచ్ వి అమరావతి,. కో-ఆర్డినెటర్ సుభద్ర, ఎన్ఎల్ టిబిటిసి కోర్డినేటర్ స్రవంతి, వినయ్ కుమార్ రఘునాథ్ శివమణి, పాల్గొన్నారు.

Spread the love