ఎస్ఎస్ఆర్  హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

నవతెలంగాణ-డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామం లోని గ్రామ పంచాయతీ అవరణలో ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ ఆసుపత్రి అధ్వర్యంలో శనివారం  ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ డీ కోండఅనుదీప్ రోగులను పరీక్షించారు.షుగర్, బిపి, థైరాయిడ్, టైఫాయిడ్,మలేరియా,డెంగ్యూ జ్వరం,దగ్గు,దమ్ము,, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలు మొదలగు వ్యాధులకు 200 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నోముల విజయ లక్ష్మి లక్ష్మారెడ్డి, డాక్టర్ అనుదీప్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love