లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచితవైద్య శిభిరం

నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ ప్రాంగణంలో శుక్రవారం లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ రేకూర్తి కంటి ఆసుపత్రి వైస్‌ ఛైర్మన్‌ చిదుర సురేష్‌ సహాకారంతో గ్రామస్థులకు ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. వైద్య శిభిరంలో సుమారు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు 25 మందికి ఆపరేషన్‌ అవసరమైనట్లు సూచించారు. అలాగే సుమారు 150 మందికి షుగర్‌, బీపీ టెస్ట్‌లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మణ్‌, జోన్‌ ఛైర్మన్‌ దొమ్మాట జగన్‌రెడ్డి, కోశాధికారి తిప్పారపు నాగరాజు, ఉపాధ్యాక్షుడు బండ జగదీశ్వర్‌, తిప్పారపు అనిల్‌, సీనియర్‌ సభ్యులు సింగిరెడ్డి మల్లారెడ్డి, పెర్యాల సుధాకర్‌రావు, డాక్టర్‌ బద్ధం తిరుపతిరెడ్డి, గంగం సంతోష్‌రెడ్డి, గుర్రాల సంజీవరెడ్డి, భైరినేని సుకుమార్‌రావు, భీంరెడ్డి రాజిరెడ్డి, తూటి చంద్రారెడ్డి, పొన్నం ఆంజనేయులు, జాలిగాం రాజు, గుగ్గిళ్ళ శ్రీనివాస్‌, గ్రామస్థులు, తదితరులు పాల్గోన్నారు.

Spread the love