నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్బర్ పేట భూంపల్లి పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పోతనక రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ నారాయణ మల్లారెడ్డి వైద్య కళాశాల యాజమాన్యం సౌజన్యంతో ఉచితంగా మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. తొలుత గ్రామ సర్పంచ్ రాజయ్య వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఈ ఉచిత వైద్య శిభిరానికి తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు యాదగిరి, లింగం, గ్రామ పెద్దలు, మెడికల్ కళాశాల యాజమన్యం, సిబ్బంది తదితులున్నారు.