నవతెలంగాణ – వాషింగ్టన్: అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీలను సగానికి తగ్గిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వరకు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలు చేస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ ఇటీవల సవాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన బీజేపీని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.