ఎఫ్ సీఐ ఆధ్వర్యంలో స్వచ్చత ర్యాలీ 

Freedom rally under the auspices of FCIనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం భారత ఆహార సంస్థ నల్గొండ జిల్లా కార్యాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో  నల్లగొండ పట్టణంలో స్వచ్ఛత హి సేవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఏటీఎం డా. రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ..  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల స్వప్నమైన వికసిత భారత సాధనకు స్వచ్ఛ భారతమే ముఖ్య సోపానమని అభిప్రాయపడ్డారు. రామగిరి లోని సంస్థ జిల్లా కార్యాలయం నుండి ఉద్యోగులు   క్లాక్ టవర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాలాపన చేశారు.కార్యక్రమంలో సీనియర్ అధికారులు కె ఎన్ కె ప్రసాద్, రఘుపతి, బిల్ల శ్రీనివాసరావు, కె కె షా, జయ కుమార్, పట్నాయక్, సుకుమార్, సెక్షన్ ఉద్యోగులు సతీష్ రెడ్డి, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love