నవతెలంగాణ వెబ్ డెస్క్:
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ 3 జెస్సికా పెగుల(అమెరికా) టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ఆడిన ఆమె నాలుగో రౌండ్లో పరాజయం పాలైంది. ఎలిసే మెర్టెన్స్(బెల్జియం) వరుస సెట్లలో 1-6, 3-6తో జెస్సికాపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఎలిసే ఆధిపత్యం చెలాయించింది. మొదటి సెట్లో రెండు టై బ్రేక్స్ గెలిచింది. రెండో సెట్లో జెస్సికా సర్వీస్ బ్రేక్ సాధించింది. అయితే.. జోరు కొనసాగించిన ఎలిసే చివరికి విజేతగా నిలిచింది.