బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి..

నవతెలంగాణ- సిరిసిల్ల: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు కొన్ని పార్టీల్లో అసంతృప్తి నెలకొంది దీంతో అనేకమంది పార్టీలు మారుతున్నారు మొదట్లో బీఆర్ఎస్ గులాబీ ఆకర్ష ఆపరేషన్ నిర్వహించింది సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రం బీజేపీ పుట్టి మునిగిందనే చెప్పుకోవచ్చు నేతలు కార్యకర్తలు పార్టీలు మారుతున్నారు అనేకమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు నేతల మెడలో ఉదయం ఓ రంగు కండువా ఉంటుండగా మధ్యాహ్నం మరో రంగు కండువా వేసుకుంటున్నారు సిరిసిల్ల నియోజకవర్గంలో నేతలు పొద్దున రాజీనామాలు మధ్యాహ్నం మరో పార్టీలో చేరికలు కనిపిస్తున్నాయి
 పెద్ద తలకాయల మార్పుతో కంగు తింటున్న పార్టీలు..
రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఇతర పార్టీల నేతలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలో ప్రజల్లో ఎవరికి ఎంత బలం ఉందో గుర్తిస్తూ వారితో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు ఇటీవల బీజేపీ నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి రమాకాంతరావు రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అన్నల్దాస్ వేణు బీజేపీ మండల అధ్యక్షులు సురువు వెంకటి బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు భాస్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు లతోపాటు అనేకమంది మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు ప్రధానంగా వరంగల్ జిల్లాకు చెందిన రాణి రుద్రమ రెడ్డికి సిరిసిల్ల బీజేపీ టికెట్ ఇవ్వడంతో అనేకమంది బీజేపీ నేతలు ఇతర పార్టీలోకి వచ్చేది రాణి రుద్రమ రెడ్డికి టికెట్ ఇవ్వడంతోనే మరో పార్టీలో చేరినట్లు ఆ నేతలు బహిరంగంగా ప్రకటించారు ప్రస్తుతం మాత్రం రానే రుద్రమ రెడ్డి బీజేపీ నేతలను ఒకే తాటిపైకి తీసుకువచ్చింది అలాగే సిరిసిల్లలోని కొంతమంది న్యాయవాదులు మంత్రి కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్ కు ఎన్నికల్లో మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. బీజేపీ పార్టీలో పనిచేసిన వేములవాడ మండలంలోని ఎంపీపీ బండ మల్లేశం జిల్లా అధికార ప్రతినిధి గోపు బాలరాజు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు అలాగే కాంగ్రెస్ నేత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కొండ ప్రతాప్ బీఆర్ఎస్ లో చేరారు సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్ ఎల్లే  లక్ష్మీనారాయణ వైద్య శివప్రసాద్ మ్యన ప్రసాద్ సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ ఇల్లంతకుంట ఎంపీపీ వెంకటరమణారెడ్డి మాధవరెడ్డి గుడిసెల ఐలయ్య రాఘవరెడ్డి ఒగ్గు బాలరాజు యాదవ్ కట్ల కనకమ్మ బత్తిని సంపత్ విన్నపల్లి టిడిపి మండల మాజీ అధ్యక్షుడు  మల్లేషం వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి సింగిల్విండో చైర్మన్ పుల్కం మోహన్ రుద్రంగి బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అల్లూరి రాజిరెడ్డి తో పాటు అనేకమంది నేతలు కార్యకర్తలు చేరారు ఇటీవల కొలనూరు మాజీ సర్పంచ్ రషీద్ కాంగ్రెస్లో చేరారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో బిజెపి నేత తుల ఉమా చేరడంతో వేములవాడ నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీకి కొంత బలం చేకూరినట్లయింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నరసయ్య రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణులు కంగుతిన్నారు అలాగే మాజీ ఎంపీపీ మందాడి జనార్దన్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సామల పావని అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ రవి నాయకులు కోడం శ్రీనివాస్ కోడం సంజీవ్ కూరపాటి శ్రీశైలం తోపాటు చీర్లవంచ లక్ష్మీపూర్ గోపాల్ రావు పల్లె బస్వాపూర్ తాడూరు చింతల్ తానా గ్రామాల్లోని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు.
అసంతృప్తుల కు కేటీఆర్ ఫోన్..
అధికార టీఆర్ఎస్ పార్టీలో అనేకమంది అసంతృప్తులను బుజ్జగించే పనిలో మంత్రి కేటీఆర్ ఉన్నారు. అసంతృప్తులతో మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కోరుతూ అసంతృప్తిగా ఉన్న వారిని పిల్చుకొని ఆయన మాట్లాడుతున్నారు సిరిసిల్ల పట్టణంతో పాటు ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి గంభీరావుపేట ముస్తాబాద్ తంగళ్ళపల్లి మండలాల్లోని కొంతమంది నేతల వల్ల ద్వితీయ శ్రేణి బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వెల్లబుచ్చుతున్నారు దీంతో ఏకంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గం లోని కొంతమంది నేతలు ఈ ఐదేళ్లపాటు ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకోకపోవడంతో ఎన్నికల్లో మంత్రికి కొంత ఇబ్బంది కనిపించింది. అది గ్రహించిన మంత్రి తానే రంగంలోకి  దిగారు ప్రస్తుతం కొంత అనుకూల పరిస్థితి కనిపిస్తుంది అలాగే బీజేపీలో అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి అసంతృప్తులు ఇతర పార్టీలోకి వెళ్తున్నారు అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్న లగిశెట్టి శ్రీనివాస్ తనకు టికెట్ రాకపోవడంతో విద్యార్థి రాజకీయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అలాగే సిరిసిల్ల పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పత్తిపాక సురేష్ సిరిసిల్ల శాసనసభకు పోటీ చేయడానికి యువతను ఆకర్షించుకుంటున్నాడు. బహుజన వాదంతో బి ఎస్ పి నుంచి పోటీ చేయడానికి ముందుకు వచ్చిన న్యాయవాది పిట్టల భూమేష్ నియోజకవర్గంలోని ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు ఇలా అభ్యర్థులు పోటీ చేస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తే పట్టణంలో ఓట్లు చిలే అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొంత ఇబ్బంది కలగానుందని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు.

Spread the love