తల్లుల నుండి పిల్లలను

వేరు చేయొద్దు : ఎస్‌ఎన్‌ఎస్‌
లండన్‌ :బ్రిటన్‌లోనూ, ఇతర అభివృద్ది చెందిన దేశాల్లోనూ కుటుంబ కోర్టులు పిల్లలను, తమ తల్లుల నుండి లాక్కుంటున్నాయని స్వచ్ఛంద సహాయ సంస్థలు, ప్రచార కార్యకర్తలు తెలిపారు. లండన్‌లో భారత హై కమిషన్‌ కార్యాలయం ముందు వారు శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. సపోర్ట్‌ నాట్‌ సెపరేషన్‌ (ఎన్‌ఎన్‌ఎస్‌) గ్రూపు ఈ ప్రదర్శన నిర్వహించింది.
సంపన్న దేశాల్లో పనిచేసుకుంటూ జీవిస్తున్న ఇమ్మిగ్రెంట్‌ కుటుంబాలకు చెందిన పిల్లలను ఇలా వేరుర చేయడం ఎక్కువైందని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. తక్కువ ఆదాయంతో బతికేవారు, సింగిల్‌ పేరెంట్‌, గృహ హింస బాధితులు ఇలాంటి వారి నుండి పిల్లలను వేరు చేయడం ఇటీవల బాగా ఎక్కువైందని ఎస్‌ఎన్‌ఎస్‌ తెలిపింది.

Spread the love