జనంపల్లికి ఫలించిన పాదయాత్ర

– పల్లె ప్రజలు సమస్యలు తెలుసుకోవడానికి నియోజ కవర్గంలో పాదయాత్ర చేసిన జనంపల్లి
– ప్రజల మార్పుతోనే గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి
నవతెలంగాణ -బాలానగర్‌
జడ్చర్ల నియోజకవర్గం ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుద్‌రెడ్డి గతంలో నియోజక వర్గంలోని బాలానగర్‌. నవ పేట. రాజాపూర్‌, జడ్చర్ల, మిడ్జిల్‌, ఊరుకొండ పేట గ్రామాలలో ప్రజలను ఓట్లు అడగడానికి రాలేదు మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు.ఆ పాదయాత్రని జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు తెలుస్తోంది. పూరిగుడిసెలో నివసిస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకుని దేశ అధినేత సోనియా గాంధీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలిపారు . బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి.. ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన భావోద్వేషంగా మాట్లాడారు. నియోజక వర్గంలోని అన్ని మండలాల గ్రామాలలో రాత్రి అనక పగలనకా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహి ంచారు. మార్పు కోరుతూ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ రాహుల్‌ గాంధీ ప్రవేశపెట్టిన ఆరు సూత్రాల పథకాన్ని అందరికీ అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. బాలానగర్‌ మండల పరిధిలోని గౌతపూర్‌లో అనురుద్‌ రెడ్డి.డబల్‌ బెడ్‌ రూమ్‌ల ధర్నా యాత్ర నిర్వహించారు.

Spread the love