నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల ఫెడరేషన్ ఆప్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైనర్స్ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పారిశ్రామిక, కార్మికరంగానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గతంలో పలు అంశాలపై ఆయనతో స్వయంగా చర్చలు జరిపామన్నారు. సౌమ్యుడు, మృదుస్వభావి, మార్క్సిస్ట్ సైద్ధాంతిక మార్గదర్శి ఏచూరి మరణం దేశానికే తీరనిలోటు అని నివాళులర్పించారు.