– రూ.26 వేల విలువగల మధ్యం స్వాధీనం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎంపీసీ అమలు నేపథ్యంలో బెల్ట్ దుకాణాలపై ఆదివారం ఎన్నికల ఫ్లైయింగ్ స్క్యాడ్ అధికారులు సోదాలు నిర్వహించారు. మండలంలోని నారంవారిగూడెం, ఆసుపాక ల్లో ఎన్నికల ఎఫ్.ఎస్.టీ అధికారి ఎల్ కృష్ణ, స్థానిక పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా, ఈ దాడుల్లో మొత్తం రూ.26 వేల విలువ చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అదే విధంగా ఇద్దరు బెల్ట్ దుకాణా దారులు పై కేసు నమోదు చేసినట్లు స్థానిక అదనపు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.