హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’తో హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది. సోమవారం మేకర్స్ ఆకట్టుకునే పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈనెల 29 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సామజవరగమన నవ్వులు పూయించనుంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్ కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అందర్నీ అలరించింది.
గోపీ సుందర్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.