సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆర్యభట్టు జానియర్ కళాశాలలో శనివారం అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవటం జరిగిందనీ కళాశాల కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు అందరిని మంత్రముగ్ధులు చేసే రీతిలో విద్యార్థుల రంగవల్లులతో, ఆటాపాటలతో, కేరింతలతో భోగి మంటల కార్యక్రమం అందరిని ఎంతగానో అలరించాయన్నారు. విద్యార్థులందరికి పండగ వైభవాన్ని తెలుపుతూ భవిష్యత్ నిర్దేషం చేస్తూ, వారి వారి కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోకళాశాల ప్రిన్సిపల్ కోఅర్డినేటర్ – రవి, హన్మంతరావు, సరేష్ గౌడ్, జైస్ ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, వెంకటేష్, అడ్వయిజర్ స్వామి , అధ్యాపక బృందం అధికసంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.