వినోదభరితంగా సంగీత్‌

వినోదభరితంగా సంగీత్‌లహరి ఫిలిమ్స్‌, ఆర్‌.బి. స్టూడి యోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సంగీత్‌’ చిత్రం మంగళవారం పూజా కార్యక్రమంతో ప్రారంభ మైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక కొణిదెల చిత్ర బందానికి స్క్రిప్ట్‌ అందించగా, శౌర్య కెమెరా స్విచాన్‌ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్‌.ఎస్‌. కార్తికేయ క్లాప్‌ కొట్టారు.
‘హంబుల్‌ పొలిటీషియన్‌ నోగ్‌రాజ్‌’ తో మంచి గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు సాద్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిసున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న నిఖిల్‌ విజయేంద్ర సింహాను ఈ చిత్రం ద్వారా లహరి ఫిల్మ్స్‌ పరిచయం చేస్తోంది. నిఖిల్‌కి జోడిగా తేజు అశ్విని కనిపించనుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా నిఖిల్‌ విజయేంద్ర సింహా మాట్లాడుతూ, ”సంగీత్‌’ నా హదయానికి దగ్గరగా ఉన్న కథ. కథానాయకుడిగా సమర్థ్‌ పాత్రలోని భావోద్వేగాలను చూపించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. దర్శక, నిర్మాతలకు, చిత్ర బందానికి నా కృతజ్ఞతలు’ అని అన్నారు. స్వర పాత్రలో నటిసున్న తేజు అశ్విని మాట్లాడుతూ, ‘ఈ చిత్రం బాంధవ్యాల గురించి, జీవితంలోని మధురానుభూతుల గురించి ఉంటుంది. ఎంతో ప్రతిభగల చిత్ర బందంతో కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉంది. స్వర పాత్రలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు. ‘పెళ్లి సమయంలో ఓ కుటుంబంలో జరిగే సంఘటనలను వినోదభరితంగా చూపిస్తూ ప్రేక్షకులను నవ్వించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నిర్మాతలు నవీన్‌, చంద్రు, శ్రవంతితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అని దర్శకుడు సాద్‌ ఖాన్‌ చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మాజ్‌ ఖాన్‌ నేతత్వంలోని రైన్‌షైన్‌ కంపెనీ ఫస్ట్‌యాక్షన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నవీన్‌ మనోహరన్‌, చంద్రు మనోహరన్‌, శ్రవంతి నవీన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్‌ఎస్‌డి టీచర్‌, నటుడు విక్రమ్‌ శివ, సూర్య గణపతి, హాస్యనటుడు హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌, సమర్పణ: జి. మనోహరం, ఎల్‌.బాలకష్ణ.

Spread the love