బస్వాపురం రిజర్వాయర్ కు రూ. 500 కోట్ల నిధులు కేటాయించాలి

Basavapuram Reservoir Rs. 500 crore funds should be allocated– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి
బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో రైతు బజార్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయుటకు రూ. 500 కోట్ల  నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభం చేసి 15 సంవత్సరాలు అవుతున్న ఇంకా పూర్తి కాలేదన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి నిర్మాణం జరిగితే సాగునీరు, త్రాగునీరుకు జిల్లాకు అందుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారానికి రిజర్వాయర్ నిర్మాణం చేశామని ప్రచారాలు చేశారే తప్ప నిర్మాణం పూర్తి చేయలేదని వారన్నారు. రిజర్వాయర్ పూర్తి నిర్మాణం కోసం రూ. 500 కోట్లు అవసరం ఉంటే రూ.50 కోట్లు ప్రకటించి ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు.
వాటితో రిజర్వాయర్ పూర్తి నిర్మాణం ఎలా పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. రిజర్వాయర్ లో ఇండ్లు ,భూమి కోల్పోయిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకొని నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతుందని విమర్శించారు. రిజర్వాయర్ లో భూమి, ఇండ్లు, కోల్పోయిన వారికి నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదనిన్నారు. రిజర్వాయర్ పూర్తి చేయడంతో గోదావరి జలాలను అందించవచ్చని అన్నారు. ప్రభుత్వం మూసికి రూ.1,50,000 కోట్లు కేటాయించి సుందరీకరణ చేస్తామని ప్రకటించారు. బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి నిర్మాణం కోసం రూ.500 కోట్లు వెంటనే ప్రభుత్వం కేటాయించి పూర్తి నిర్మాణం చేపట్టాలన్నారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందరికీ చెల్లించేటట్లు ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ సామూహిక నిరసన దీక్షకు బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ ,దయ్యాల నరసింహ, సిరిపంగి స్వామి, బబ్బూరి పోశెట్టి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, సీపీఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, బీబీనగర్ మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు, సీపీఐ(ఎం) మండల ,పట్టణ నాయకులు బందెల ఎల్లయ్య, వనం రాజు, వల్లాస్ అంజయ్య, కొండమడుగు నాగమణి, కొండ అశోక్, మధ్యపురం బాల్ నరసింహ, కొండాపురం యాదగిరి, పాండాల మైసయ్య, పొట్ట యాదమ్మ, మంద కిరణ్, మచ్చ భాస్కర్, నరాల చంద్రయ్య, దిడ్డి కాడి మైసయ్య, ఎండి.సలీం, మధ్యబోయిన సుందరయ్య, ఎనబోయిన లింగం  పాల్గొన్నారు.
Spread the love