Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుత్ప గ్రామ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

గుత్ప గ్రామ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి

- Advertisement -

నియోజకవర్గ ఇన్చార్జికి వినతి పత్రం అందజేత 
నవతెలంగాణ – ఆర్మూర్

ఆలూరు మండలం గుత్ప గ్రామ అభివృద్ధి కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డికి గ్రామ సర్పంచ్ కమల దశరథ్ ఆధ్వర్యంలో బుధవారం  వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దశరథ్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణానికి నిధులు అత్యవసరమని తెలిపారు.

అదేవిధంగా మధ్యలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన వినయ్ రెడ్డి, గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జితేందర్, సురేష్, మోజెష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -