నవతెలంగాణ – బొమ్మలరామరం
గ్రామ అభివృద్ధి కొరకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని బొమ్మలరామరం మండలం హాజీపూర్ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ కోరారు. శనివారం యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధికి కొరకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల నరసింహ, సంజీవరెడ్డి, అశోక్, నరసింహ, రాజు, శంకరయ్య, సుమన్, మల్లేష్, రమేష్, బాబు, పరమేష్, మోహన్ రెడ్డి, మహేష్,కళ్యాణ్, వంశీ, గిరిబాబు,పాల్గొన్నారు.