కారుకు అంత్యక్రియలు..

నవతెలంగాణ – అహ్మదాబాద్: గుజరాత్‌లోని అమరేలి జిల్లాలో ఓ రైతు కుటుంబం తమ లక్కీ కారును సమాధిలో పాతిపెట్టారు. కారు అంత్యక్రియలకు పూజారులతో సహా దాదాపు 1500 మంది హాజరయ్యారు. సంజయ్ పొల్లారా కుటుంబానికి సంపదను తెచ్చిపెట్టిన కారును అమ్మడం ఇష్టంలేక తమ సొంత పొలంలో పాతిపెట్టారు. 12 ఏళ్ల నాటి వ్యాగన్ ఆర్ కారును 15 అడుగుల లోతులో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. పూలమాలలు వేసి, పూలలతో అలంకరించడమే కాకుండా పూజారుల మంత్రోచ్ఛారణలు చేసి పచ్చటి గుడ్డ కప్పారు. చివరకు ఎక్స్ కవేటర్ వచ్చి మట్టితో పూడ్చిపెట్టారు. తమ భవిష్యత్ తరాలు ఆ కారును మరిచిపోకూడదని, కుటుంబానికి సకల సంపదలు తెచ్చిపెట్టిన కారు సమాధి అయిందని తెలిసేలా దహన సంస్కారాలు జరిగిన స్థలంలో చెట్టును నాటుతామని కుటుంబీకులు తెలియజేశారు. ఇందుకోసం కుటుంబసభ్యులు దాదాపు నాలుగు లక్షల రూపాయలు వెచ్చించారు.

Spread the love