ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి సహకారంతో మల్లుపల్లి మరింత అభివృద్ధి‌

– సర్పంచ్‌ సిద్ది భారతి భూపతి గౌడ్‌
నవతెలంగాణ-మిరు దొడ్డి

గ్రామాలు అభివద్ధి చెందడానికి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఎంతగానో సహకరించడం జరుగుతుందని మల్లుపల్లి సర్పంచ్‌ సిద్ది భారతి భూపతి గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మల్లుపల్లి గతంలో ఇలాంటి అభివద్ధి జరగకుండా ఉండడం చూసి గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిని కలవగా గ్రామానికి ప్రత్యేకంగా సిసి రోడ్‌ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలతో సిసి రోడ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్‌ అండ్‌ బి రోడ్డు వైపు 30 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు .వాటితోపాటు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాలుగు కోట్ల 58 లక్షలతో చెక్‌ ద నిర్మాణం కూడా వెళ్లి వాగు పై ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామం స్వచ్ఛ గ్రామంగా తీర్చి దిద్దడానికి గ్రామ పంచాయతీ నుండి కూడా నిధులు ఖర్చు చేస్తూ గ్రామాన్ని మరిం త అభివద్ధి చేయడం జరిగిందని తెలిపారు. నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటుకు 25 లక్షల రూపాయలు ప్రజలకు వైద్య సేవల కోసం ఆసుపత్రి కి 16 లక్షల రూపాయలు మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి 20 లక్షల రూపాయలను అందించాలని తెలిపారు. స్మశాన వాటిక నిర్మాణానికి 16 లక్షలు అందించారన్నారు. మల్లుపల్లి గ్రామానికి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మంత్రి హరీష్‌ రావు సహకారంతో మరింత అభివద్ధికి సహకరించాలని గ్రామ సర్పంచ్‌ సిద్ది భారతి భూపతి గౌడ్‌ కోరారు.

Spread the love