నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి నియమితులయ్యారు. క్యాబినెట్ హోదాలో చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలపూర్ గ్రామానికి చెందిన జిల్లెల చిన్నారెడ్డి 1955లో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య వరకు వనపర్తిలో చదువుకున్నారు. 1970లో విద్యార్థి సంఘ నాయకుడిగా, ఆ తరువాత 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా ఉంటూ వనపర్తి టికెట్ సాధించి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ 1989లో పోటీచేసి మొదటిసారి గెలుపొందాడు. 2004లో వైఎస్‌ఆర్ మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానూ పని చేశారు.