ప్రచ్ఛన్న యుద్ధం అవశేషమే జి-7

–  ఉత్తర కొరియా విమర్శ
సియోల్‌ : ప్రచ్ఛన్న యుద్ధం అవశేషంగా జి-7 దేశాలను ఉత్తర కొరియా విమర్శించింది. ఆ దేశాలు తమ స్వంత ప్రయోజనాల కోసం ఘర్షణలు సృష్టిస్తాయని, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తాయని విమర్శించిందంటూ ప్రభుత్వ మీడియా కెసిఎన్‌ఎ మంగళవారం తెలిపింది. గత వారం టోక్యోలో సమావేశానంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉత్తర కొరియా ఆత్మరక్షణ చర్యలను, చట్టబద్ధమైన సార్వభౌమాధికారాన్ని జి-7 దేశాల విదేశాంగ మంత్రులు విమర్శించడాన్ని ప్యాంగాంగ్‌ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా తప్పుబట్టారు.

Spread the love