– సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని, తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజా యుద్ధనౌక గద్ధర్ సంస్మరణ సభను ఈనెల 20న ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ సంస్మరణ సభలో వామపక్ష పార్టీలు, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు, విప్లవ శక్తులు, కవులు, కళాకారులు, గద్దర్ అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని వారు సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అనారోగ్య కారణాలతో ఈనెల ఆరో తేదీన గద్దర్ మరణించిన విషయం తెలిసిందే.తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేపట్టిన సంస్కరణలు ప్రజల మన్ననలను పొందాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.