ఉగాదికి గద్దర్‌ సినిమా అవార్డుల ప్రదానం: భట్టి విక్రమార్క

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఉగాదికి గద్దర్‌ సినిమా అవార్డులను ప్రదానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు గద్దర్‌ సినిమా అవార్డుల కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీకి సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.

Spread the love