గద్దర్ మృతి అణగారిగ వర్గాలకు తీరని లోటు

– గద్దర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసిన
–  ప్రముఖ కవి అనంతవరం మాణిక్య లింగం
నవతెలంగాణ-కోహెడ
ఎన్నో పాటలను రాయడమే కాకుండా అశువుగా వేలాది పాటలు పాడి ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పెంచి పీడన నుండి విముక్తిని కలిగించిన ప్రజా కవి,విప్లవవేత్త గద్దర్ మరణం అణగారిణ వర్గాలకు తీరని లోటని ప్రముఖ కవి అనంతవరం మాణిక్య లింగం ఒక ప్రకటనలో విచారం వ్యక్త పరచారు. ఇటువంటి గొప్ప ప్రజా వాగ్గేయకారులు నిష్క్రమించడం సాహితీలోకానికి బాధాకరమని, తన తండ్రి రాసిన గ్రంథాల సంపుటి ‘వరకవి సిద్దప్ప తత్వ కవిత’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో 2017లో జరగగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయనతో పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేశారు. సిద్దప్ప ఆశ్రమాన్ని సందర్శిస్తానని మాటిచ్చారని, కాని ఇంతలోనే గద్దర్ అందరికీ దూరమయ్యారని,వారి మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Spread the love