గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

Gaddenna Vagu Project water release MLAనవతెలంగాణ – భైంసా
గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని గురువారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో సాగునీటి కోసం నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈసారి రబీ సీజన్లో పదివేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ప్రధాన కాలువ మరమ్మత్తులు, ఇతరత్రా వాటికోసం ప్రభుత్వం నుండి నిధులు తెప్పిస్తానన్నారు నియోజకవర్గంలో రైతాంగానికి మరింత సాగు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ డి. ఇ. అనిల్, ఎ. ఇ. శ్రీకాంత్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, బిజెపి పట్టణ అధ్యక్షులు మల్లేష్, సీనియర్ నాయకులు సొలంకి భీంరావు, రమేష్,నాయకులు రావుల పోశెట్టి, దిలీప్, వడ్నప్ శ్రీనివాస్, గట్టు ప్రవీణ్, రాము,తానూర్ మండల నాయకులు శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love