గడిల పాలనను తరిమికొట్టాలి

– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
గడిలో పాలనను తరిమి కొట్టి, వీరనారి చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని నయా నిజం కేసీఆర్ ను దగాకొరు దయాకర్ రావు ను తరిమికొట్టడనికి సిద్దంగా ఉండాలని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్వినీ రెడ్డి అన్నారు. మంగళవారం మండలం లోని మడిపల్లి,కంటాయపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడుతూ వీరనారి చాకలి అయిలమ్మ పుట్టిన గడ్డ ఈ పాలకుర్తి గడ్డ.చాకలి అయిలమ్మ ను స్ఫూర్తిగా తీసుకుని గడిల పాలను బద్దలు కొట్టాలని నయా నిజాం కేసీఆర్ ను దగా కొరు దయాకర్ రావు ను తరిమికొట్టడనికి సిద్దంగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే గా తనని గెలిపిస్తే నియోజక వర్గానికి ఇండస్ట్రియల్ తీసుకు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పింస్తానని ఎమ్మెల్యే గా గెలిపిస్తే నాకు వచ్చే జీతం కూడా మీ అందరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని మన పథకాలను చూసి కాపీ కొట్టి 100 రూపాయలు తగ్గించి చేశారని అవి నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి అధిక మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్, సోమేశ్వరరావు కాకిరాల హరిప్రసాద్ పెదగాని సోమయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love