సామ్‌సంగ్‌ నుంచి గెలాక్సీ ఎం34 5జీ

గుర్‌గావ్‌ : ప్రముఖ మొబైల్‌ తయారీదారు సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త గెలాక్సీ ఎం34 5జీని విడుదల చేసింది. 6.6 అంగులాల సూపర్‌ అల్మోడ్‌ డిస్‌ప్లే, ఒఐఎస్‌తో 50 ఎంపీ ట్రిపుల్‌ రేర్‌ కెమెరా, 6000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 25వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ మద్దతుతో దీన్ని ఆవిష్కరించింది. 6జిబి ర్యామ్‌. 128 జీబీ స్టోరేజీ ధరను రూ.16,999గా, 8జీబీ, 128 జీబీ ధరను రూ.18,999గా నిర్ణయించింది. జులై 15 నుంచి ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో లభ్యమవుతుందని తెలిపింది.

Spread the love