నవతెలంగాణ వరంగల్: హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ ద్విచక్రవాహనదారుడు మహేందర్ గల్లంతయ్యాడు. వాహనంపై వాగుమీదు వెళ్తుండగా బైకు అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తొర్రూర్ డివిజన్ పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో వాగు దాటుతూ అన్నదమ్ములిద్దరూ కొట్టుకుపోయారు. వారిని పిండి శ్రీను, పిండి యాకయ్యలుగా గుర్తించారు. వారిలో పిండి శ్రీను మృతదేహం లభ్యం గాగ, యాకయ్య కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.