పిల్లలకు ఆటలే ఆయుధం..

నవతెలంగాణ-హైదరాబాద్ : పిల్లలకు ఆటలే ఆయుధమని డా హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. మాస్టర్స్ గేమ్స్ అండ్ తెలంగాణ చైర్మన్ వినయ్, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 8,9 తేదీల్లో క్రికెట్ ,పుడ్ బాల్ పోటీలు నిర్వహించటం జరిగింది. ఈ పోటీలలో సాధన,నియో ఐజీ స్కూల్స్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన డా.హిప్నో పద్మా కమలాకర్ , గోపాల్ కృష్ణ, పి.స్వరూపా రాణి బహుమతులు అందజేసారు.ఆమె మాట్లాడుతూ సంతోషంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడటం ఎంతో అవసరమన్నారు. పిల్లలను ఆటలు ఆడటానికి, ప్రొత్సహిస్తున్న తల్లి దండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆటలతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, క్రియేటివిటీ బాగా పెరుగుతాయని చెప్పారు. శారీరక ఆరోగ్యానికి దూరమవుతున్నారన్నారు. బద్దకానికి బానిసలవుతున్నారని తెలిపారు. గెలుపు ఓటములను సమంగా చూడడం, భావోద్వేగాల నియంత్రణ, క్రీడాస్ఫూర్తి మొదలైనవి చిన్నప్పటి నుండే ఆటల ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. అంతరాలు లేని స్నేహం అక్కడి నుండే చిగురిస్తుందన్నారు. ప్రతి రోజూ పిల్లలను ప్రొత్సహిస్తూ ఆటలు ఆడిస్తున్న ఎమ్ జిటి చైర్మన్ వినయ్,ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ రామారావు, భారత్ కుమార్, స్కూల్స్ కెప్టెన్స్ బెల్లం కొండ భార్గవ, శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.ఈ పోటీలో సాధన ఇన్ ఫీనిటి ఇంటర్ నేషనల్ స్కూల్, నియో ఐజా స్కూల్, స్కాలర్స్ అకాడమీ స్కూల్ విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు.

Spread the love