నవతెలంగాణ- గోవిందరావుపేట:
మండలంలోని పసర రామాలయంలో సోమవారం గణపతి హోమం దిగ్విజయంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డింగిరి రంగాచార్యులు నియమ నిష్ఠలతో హోమ క్రతువు నిర్వహించారు. కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి రమేష్ సమ్మిరెడ్డి ఆదినారాయణ తోపాటు మిగతా సభ్యులు కూడా హోమ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.