మండపాలలో కొలువుదీరిన గణనాథులు

నవతెలంగాణ-దుమ్ముగూడెం
వినాయక నవరాత్రి మహౌత్సవాలలో సందర్భంగా మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన గణనాధుడు పచ్చని తోరణాలతో అలంకరించిన మండపాలలో వివిద రూపాల ప్రతిమలతో తయారు చేసిన ఆది దేవుడు గణ నాధుడు కొలువు తీరాడు. వినాయక మండపాలలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్ద ప్రసాదాలు అందజేశారు. మంగళవారం రెండవ రోజు మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల మట్టి వినాయకుల ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఏది ఎమైనా మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రులు భక్తి శ్రద్దలతో ప్రారంభం అయ్యాయనే చెప్పవచ్చు.
వినాయకుడికి పీవో దంపతులు ప్రత్యేక పూజలు
భద్రాచలం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆదివారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్‌ జైన్‌ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు వారికి సంప్రదాయ బద్ధ స్వాగతం పలికారు. పీవో దంపతులకు అర్చకులు వేద ఆశీర్వాదం అందజేశారు. గుండాల గుండాల మండల కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ వీధిలో సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కాలనీలోని ఉత్సవ కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడానికి మండపం ఏర్పరచి వినాయక విగ్రహం ప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహ దాతలు ఆవుల శ్రీను దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కోడూరి శ్యామ్‌, వాసం సమ్మయ్య, తీగల సురేష్‌, వి.శీను, పాలకుర్తి శేఖర్‌, మొక్క నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. ఆళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు అనంతోగు, మర్కోడు, రామాంజిగూడెం, రాఘవాపురం, రాయిపాడు, తదితర గ్రామాల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు జరపడానికి మండపాలు ఏర్పాటు చేసి, వినాయకుడి విగ్రహాలను ఆయా గ్రామాల ఉత్సవ కమిటీలు సోమవారం ప్రతిష్ఠించాయి. అందులో భాగంగా అనంతోగు గ్రామంలో మండపంలో ఉత్సవ కమిటీకి వినాయక విగ్రహాన్ని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి-కిశోర్‌ బాబు దంపతులు కానుకగా ఇచ్చారు. సోమ, మంగళవారాలు భక్తులు వివిధ మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ఆళ్ళపల్లి కిరాణా షాపు యజమాని గౌరిశెట్టి చంద్రశేఖర్‌-శ్రీదేవి దంపతులు రామాలయం గుడి వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Spread the love