అడ్మిషన్ డ్రైవ్ చేపట్టిన గాంధారి ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారిలో పని చేస్తున్న అధ్యాపకులు శుక్రవారం గాంధారి మండలంలోఅడ్మిషన్ డ్రైవ్ చేపట్టారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటికి వెళ్లి ఇంటర్ లో చేరాలని ప్రచారంనిర్వహించారు మండల కేంద్రంలోని Govt.హై స్కూల్, విజ్ఞాన్, కృష్ణవేణి, వివేకానంద, తదితర పాఠశాల లో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు.ప్రభుత్వ కళాశాల లో విద్యను అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలను అధ్యాపకులు తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వం అందించే ఉచితపాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సదుపాయం, బస్సు సదుపాయం ,స్టడీ మెటీరియల్స్ అవన్నీ ఉచితంగా పొందవచ్చు అని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్లు ఎన్. లక్ష్మణ్ జెట్టి విజయకుమార్, కె.రమేష్, స్వప్న , వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

 

Spread the love