గాంధీజీ సేవలు అమూల్యం

Gandhiji's services are invaluable– నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి మహాత్మాగాంధీ అందించిన సేవలు అమూల్యమైనవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాస ప్రేరణతో, దేశ ప్రజలకు ఆయన అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతరం స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నాయని తెలిపారు. అక్టోబర్‌ 2వ తేదీ మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఆయన గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవల్ని స్మరించుకున్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధి, కులవృత్తుల బలోపేతంతో గ్రామీణ ఆర్థికాభివృద్ధితో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతి రూపాలుగా నిలిచాయని చెప్పారు. గాంధీజీ సిద్ధాంతాలు, కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకుని స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు

Spread the love