గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి మల్టీ జోన్ 1 ఐ.జి.పి ఎస్. చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి

నవతెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని గణేష్ నిమజ్జనోత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునే విధంగా ప్రజలందరూ సహకరించాలని  మల్టీ జోన్ 1 ఐ.జి.పి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పి.యస్. వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం నాడు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో పర్యటించడం జరిగింది. మొట్టమొదలు పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది నుండి గౌరవవందనం స్వీకరించారు. తరువాత పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఓం గణేష్ మండలి యందు పూజా కార్యాక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గోని వచ్చినటు వంటి స్నేహ సొసైటీ, సామన్య ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించడం జరిగింది. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ యందు పర్యవేక్షించి మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐ.జి  మాట్లాడుతూ.. మతకల్లోహాలు సృష్టించే కొందరు రౌడీషీటర్లను బైండోవర్ చేసి చర్యలు చేపట్టామని, నిమజ్జనానికి సంబంధించి అన్ని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యలు చేపట్టి పికేట్లు కూడా వేశామని తెలియజేశారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాల కోసం పత్రిక ప్రకటనలు కూడా విడుదల చేశామని, నగరంలోని చిన్న విగ్రహాలు వినాయక బావిలో మరియు మద్యస్థంగా ఉండే విగ్రహాలను బాసరా గోదావరి నదిలో నిమజ్జనం చేయాలి, 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు జాన్కంపేట్ నవిపేట్ వద్ద రైల్వే ఎలక్ట్రిక్ లైన్ ఉన్నందువలన రైల్వే వారు లేవల్ బీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను బాసరకు వెళ్లేందుకు కష్టం అయినందున, బాసరకు కొద్ది దూరంలో ఉన్నటు వంటి నందిపేట్ మండలం ఉమ్మెడ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అని ఐ.జి.పి మల్టీ జోన్ 1 గారు అన్నారు. 8 ఫీట్లకన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు మాక్లూర్ మండలం మీదుగా నందిపేట్ మండలం ఉమ్మెడ కు వెళ్లాలని కోరినారు. హైదరాబాద్, కామారెడ్డి జగిత్యాల్, మరియు ఇతర జిల్లాల నుండి వచ్చేవారు నందిపేట మండలం ఉమ్మెడ వద్ద నిమజ్జనం ఏర్పట్లు చేయడం జరిగిందని, కావున ప్రజలందరూ పోలీస్ వారితో సహకరిస్తూ నిమజ్జనం చేయాలని కోరారు. వినాయకుల ఊరేగింపులో ఆకతాయిలను జేబు దొంగలను నియంత్రించడానికి క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్ లను మఫ్టీలో పోలీసు భద్రత సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందుకు సి.సి కెమెరాల నిఘా నేత్రాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి సౌండ్ సిస్టమ్ లకు ఎలాంటి అనుమతి లేదని డి.జే లు పెట్టే గణేష్ మండలి సభ్యుల పై తగిన చర్యలు తీసుకొని,  నిమర్జనం నిర్వహించాలని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికీ ఆటంకం కలగకుండా భారీ శబ్దాలు చేసే సౌండ్ సిస్టంలకు ఎలాంటి అనుమతి లేదని హెచ్చరించారు. ప్రజలు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో పోలీస్ సిబ్బందికి సహకారాలతో నిమర్జనాలు చేపట్టాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనంతరం నెహ్రూపార్క్ వద్ద గణేష్ శోభయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్  కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్ అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) కోటేశ్వర రావ్, అదనపు డి.సి.పి (ఎ.ఆర్) శంకర్ నాయక్ ,నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్, స్పెషల్ బ్రాంచ్, ఎ.ఆర్, ట్రాఫిక్, సి.సి.ఆర్.బి, ఎ.సి.పిలు రాజావెంకట్రెడ్డి,  బస్వారెడ్డి,  శ్రీనివాస్,  శ్రీనివాస్ రావు  నాగయ్య,  నారాయణ,  రవీంధర్ రెడ్డి , సి.ఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Spread the love