గణేశ్‌ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలి: పొన్నం ప్రభాకర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: గణేశ్‌ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ భక్తులకు విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తదితరులతో కలిసి విహంగ వీక్షణం ద్వారా నిమజ్జనాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయంలోపు నిమజ్జనాలు పూర్తవుతాయని ఆశిస్తున్నాం’’అని మంత్రి పొన్నం తెలిపారు.

Spread the love