గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని 3 టౌన్ ఎస్ఐ మహేష్ తెలిపారు. సర్వ జనిక్ గణేష్ ఉత్సవ నిర్వాహకులు సూచించన మేరకు ఈనెల 17న గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. కావున గణేష్ నిమజ్జనం ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు. దుబ్బా నుండి ప్రారంభమయ్యే గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో చెరువులు కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులను అనుమతించొద్దని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన గణేష్లను ప్రతి ఒక్కరూ యువ పద్ధతి పాటిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో సూచించిన విధంగా నిమజ్జనానికి బయలుదేరాలని తెలియజేశారు. ఈ మధ్యన సమయంలో ఎలాంటి అందాలను సృష్టించకూడదని ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే కేసులు నమోదు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు తూచా తప్పకుండా పోలీస్ శాఖ అధికారులు సూచించిన నియమ నిబంధనలను పాటించాలన్నారు.
Spread the love