నవతెలంగాణ-వెల్దుర్తి : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మాసాయిపేట్ వెల్దుర్తి మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామాల్లో సోమవారం గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం వేదమంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా గణేషుడికి నిత్య దూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు వారం రోజులపాటు గణేష్ ఉత్సవాలను నిర్వ హించడం జరుగుతుందని గణేష్ వంటపాల నిర్వాహకులు తెలిపారు. తీర్థప్రసాదాలు భక్తులకు వితరణ చేస్తున్నారు. భజన కార్యక్రమాలను భక్తి భావనతో నిర్వహిస్తున్నారు కొందరు విద్యార్థులు అయితే పాఠశాలలకు వెళ్లకుండా గణేష్ మండల వద్దనే కాలయాపన చేస్తున్నారు. గణేష్ మండపాల వద్ద ఏవైనా సంఘటనలు జరిగితే పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని ఎస్‌ఐ మధుసూదన్ గౌడ్ తెలిపారు.
నవతెలంగాణ- కొల్చారం : మండరంలోని పైతర గ్రామంలో సోమవారం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్ష్మీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి మంగళవారం ఆలయ అర్చకులు ఆచారికష్ణ త్రిపాఠి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం వినాయక మంటపాల నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి యేటా వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుంద న్నారు. అలాగే ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుపుతామని ఇందులో భాగంగా ఆలయంలో రాత్రి వేలల్లో భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహాకులు, భక్తులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నిజాంపేట : మండలంలోని గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకు న్నారు. ప్రత్యేకంగా యువతి యువకులు గణేష్ మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారీ గణేష్ విగ్రహాన్ని పెట్టి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాల్లోనూ జరుపుకోవాలన్నారు. లడ్డు వేలంపాటలో కూడా పాల్గొనడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బండారి కవిత, నాగమణి, నరసవ్వ, చిన్నక్క, లావణ్య పాల్గొన్నారు.
నవతెలంగాణ-పెద్దశంకరంపేట్
పెద్ద శంకరంపేటతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఘనంగా వినాయక చవితి పండుగలను చేసుకున్నారు. ఆయా దేవాలయాలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో పేట పట్టణంలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు.