ఎమ్మార్పీఎస్ అమరుల ఆసియా సాధనకై పోరాటాలు కొనసాగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గంగారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి మండల పార్టీ పార్టీ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ పుట్ట దేవరాజు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ,ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ పాల్గొని ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండా ఎగిర వేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలు అమరులైన అమరులకు నివాళులర్పించి, సారీ ఆసియా సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆరోపించారు. ఇదే రోజు మాదిగల ముద్దుబిడ్డ అణగారిన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు. కొట్టే శివ, మట్టెడ బాలస్వామి ,గుట్ట కళ్యాణ్, చిలుక రాజు, కొట్టే కళ్యాణ్, మాచర్ల బాబు మండల నాయకులు, కొట్టే అంటోని మండల నాయకులు ,ఏనుట్ల గణేష్, గంగారపు చిన్ని ,నక్క పవన్ ,కొట్టే భాస్కర్ ,నక్క శీను, గంగారపు అశోక్ ,తదితరులు పాల్గొన్నారు.