టీజేయు మోటకొండూరు మండల అధ్యక్షుడిగా గట్టికొప్పుల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నిక…..

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మోటకొండూరు మండల అధ్యక్షులుగా గట్టికొప్పుల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల సమావేశానికి ముఖ్య అతిథిగా టీ జే యు జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్ బాబా పాల్గొని వారికి నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం  నూతన మండల కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామకమైన మండల కమిటీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా బోట్ల నర్సింగరావు, కార్యదర్శిగా కొల్లూరు మల్లేష్,ప్రధాన కార్యదర్శిగా తొండల సతీష్ గౌడ్,సహాయ కార్యదర్శిగా కంది చంద్రకళ,కోశాధికారిగా సయ్యద్ అక్బర్,కార్య వర్గ సభ్యులుగా నవీన్ నాగరాజు,మొహమ్మద్ పాషాలు ఎన్నుకున్నారు.
Spread the love